తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ - చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నిత్యావసర వస్తువుల పంపిణీ

ప్రజా విరాళాలతో సమీకరించిన బియ్యం, నిత్యావసర వస్తువులను రామడుగు మండలం దేశ్రాజపల్లి గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వ నిర్ణయాలను తప్పక పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

mla sunke ravi shankar  distributed food items at deshraj palli village karimnagar district
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌

By

Published : Apr 7, 2020, 1:46 PM IST

ప్రజా విరాళాలతో సేకరించిన 15 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసరాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశ్రాజపల్లి గ్రామంలో 100 కుటుంబాలకు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు.

లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రపంచంపై కరోనా పంజా- ఫ్రాన్స్​లో మరో 833మంది

ABOUT THE AUTHOR

...view details