కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన సమత, మమత, గంగాధర మండలం ర్యాలపల్లికి చెందిన అక్కా తమ్ముళ్లు మనీషా, రాజులతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన క్యాంపు కార్యాలయంలో సహపంక్తి భోజనం చేశారు.
మీకు నేనున్నా: అనాథ పిల్లలతో ఎమ్మెల్యే సుంకె సహపంక్తి భోజనం - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడమే కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ది ప్రత్యేక స్థానం. గతంలో తాను అండగా నిలిచిన బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. స్వయంగా వడ్డించి.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. మీకు నేనున్నానంటూ భరోసా కల్పించారు.
మీకు నేనున్నా: అనాథ పిల్లలతో ఎమ్మెల్యే సుంకె సహపంక్తి భోజనం
గతంలో వీరికి ఆర్థిక సాయం అందజేయగా.. వారికి జీవితంపై భరోసానిచ్చేలా ఏటా వారితో భోజనం చేసి కష్టసుఖాలు పంచుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా వారికి నూతన దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్, మార్కెట్ ఛైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, భూమారెడ్డి, సాంబయ్య, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.