తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయాలి: ఎమ్మెల్యే రవిశంకర్ - MLA Suneke Ravishankar meets farmers in Chopdandi zones

వానాకాలంలో మొక్కజొన్న సాగు వద్దని ఎమ్మెల్యే రవిశంకర్ రైతులకు సూచించారు. దీనివల్ల దిగుబడి తక్కువగా వస్తుందని, కత్తెర పురుగు ఎక్కువ విస్తరిస్తుందని పేర్కొన్నారు. పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయాలని సూచించారు. రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

MLA Suneke Ravishankar meets farmers in Chopdandi zones of Karimnagar district
పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయాలి: ఎమ్మెల్యే రవిశంకర్

By

Published : May 29, 2020, 4:48 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని రైతులతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశమయ్యారు. సేంద్రియ ఎరువులు, నాణ్యమైన విత్తనాలు పంటలకు ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నియంత్రిత వ్యవసాయం రైతులకు లాభసాటిగా మారనుందని వెల్లడించారు. పంట మార్పిడి విధానం వల్ల మార్కెట్ డిమాండ్ మేరకు పంటల సాగుతో లబ్ది పొందాలని రైతులను కోరారు. సేంద్రియ పద్ధతిని అనుసరిస్తున్న కర్షకులను అభినందించారు.

మొక్కజొన్న సాగు వద్దు

వానాకాలంలో మొక్కజొన్న సాగు వద్దని ఎమ్మెల్యే రవిశంకర్ రైతులకు సూచించారు. దీనివల్ల దిగుబడి తక్కువగా వస్తుందని, కత్తెర పురుగు ఎక్కువ విస్తరిస్తుందని తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని.. పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయాలని సూచించారు. రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details