కేసీఆర్, కేటీఆర్ కలిసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా నియంత పాలన కొనసాగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలోకి దింపుతున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష గొంతును వినిపించేందుకు పట్టభద్రులు సహకరించాలని మొదటి ప్రాధాన్యత ఓటు జీవన్ రెడ్డికే వేయాలని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ... ఎమ్మెల్సీ పోరులో గెలిపిస్తే ప్రజల పక్షాన గొంతును వినిపిస్తానని జీవన్ రెడ్డి కరీంనగర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలిపారు.
'ప్రజాగొంతును వినిపించాలంటే జీవన్‌రెడ్డిని గెలిపించండి' - KCR
తెరాస ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రజాగొంతును వినిపించాలంటే జీవన్‌రెడ్డిని గెలిపించండి'