తెలంగాణ

telangana

ETV Bharat / state

చెక్ డ్యామ్​ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - MLA Satish Kumar on check dams latest

రూ. 11 కోట్లతో మోయ తుమ్మెద వాగుపై నిర్మించనున్న మూడు చెక్ డ్యామ్​ల నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మరిన్నిటి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాట్లు వెల్లడించారు.

MLA Satish Kumar laid the foundation stone for the construction of the check dams
చెక్ డ్యామ్​ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

By

Published : Dec 30, 2020, 8:17 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో రూ. 11 కోట్ల 32 లక్షల వ్యయంతో మోయ తుమ్మెద వాగుపై నిర్మించనున్న మూడు చెక్ డ్యామ్​ల నిర్మాణానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. చెక్ డ్యామ్​ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో మరిన్ని చెక్ డ్యామ్​ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

కరవు మండలాలైన చిగురుమామిడి, సైదాపూర్​కు ఇప్పటికే గోదావరి జలాలు మిడ్ మానేరు కాలువల ద్వారా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హుస్నాబాద్​లో కరవును తొలగించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. వచ్చే ఏడాది ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ రవీందర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గొల్లపల్లి లొల్లిలొల్లి: తెరాస, భాజపా వివాదం.. పోలీస్‌స్టేషన్​లో ఉద్రిక్తం

ABOUT THE AUTHOR

...view details