కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల, గర్షకుర్తి, గంగాధర, మల్లాపూర్,బూర్గుపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. ఐదు వేల ఎకరాల క్లస్టర్ ఆధారంగా 20 లక్షల రూపాయలతో రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. సుమారు 300మంది రైతులతో పంటల సాగు, భవిష్యత్ కార్యాచరణను చర్చించుకునే సౌకర్యం ఉంటుందన్నారు.
రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సుంకె - కరీంనగర్ జిల్లా వార్తలు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తేవడమే రైతు వేదికల లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
ప్రతి రైతు వేదికలో విశాల గది, కంప్యూటర్ గది, అధికారుల కోసం ప్రత్యేక గది ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రైతువేదిక పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో 750 కోట్ల రూపాయలతో రైతు కల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులను అన్ని విధాలా సుఖ సంతోషాలతో చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్ర గిడ్డంగుల శాఖ ఛైర్మన్గా మందుల సామేల్ బాధ్యతలు