కరీంనగర్ జిల్లా గంగాధరలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 94 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 94 లక్షల 12 వేల విలువైన చెక్కులు వితరణ చేశారు.
'కరోనా సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రభుత్వ ప్రాధాన్యత' - latest news of karimnagar district
కరోనా కష్టకాలంలోనూ తెరాస ప్రభుత్వం సంక్షేమానికే అధిక ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
'కరోనా సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రభుత్వ ప్రాధాన్యత'
తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న సంక్షోభ సమయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు