కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామానికి చెందిన కోరెపు ఎల్లయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం మలేషియాకు వెళ్లాడు. అనారోగ్యానికి గురై అక్కడే మృతి చెందాడు. మృతదేహం స్వగ్రామానికి రావడానికి అక్షరాల లక్షా ముప్పై వేలు ఖర్చు అవుతుందని అక్కడి ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
స్పందన: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రసమయి హామీ - MLA Rasamayi assures the victim ellaiah’s family
రెండేళ్ల క్రితం ఉపాధి కోసం మలేషియా వెళ్లిన కోరెపు ఎల్లయ్య అనారోగ్యంతో అక్కడే మృతి చెందాడు. అతని చివరి చూపు కోసం కుటుంబ సభ్యులు పరితపిస్తున్న తీరును ఈటీవీ భారత్ ప్రచురించింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కథనానికి స్పందించారు.
స్పందన: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రసమయి హామీ
ఆ నిరుపేద కుటుంబం అంత మొత్తం చెల్లించలేక..ఎల్లయ్య చివరి చూపు కోసం పరితపిస్తున్న తీరును ఈటీవీ భారత్ ప్రచురించింది. ఈ కథనంపై మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: మలేసియాలో తెలుగువాసి మృతి..