అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేసినప్పుడే గ్రామానికి సరైన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో.. ఆయన పర్యటించారు. నియోజకవర్గంలోని పర్లపల్లి గ్రామానికి.. జాతీయస్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమన్నారు.
'కలిసి పని చేసినందుకే.. గ్రామానికి జాతీయ గుర్తింపు'
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటించారు. నియోజకవర్గంలోని పర్లపల్లి పంచాయతీ కార్యాలయంలో.. అధికారులతో సమావేశమయ్యారు. గ్రామానికి.. జాతీయ ఉత్తమ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.
జాతీయ ఉత్తమ గ్రామం
పంచాయతీ కార్యాలయంలో.. సర్పంచ్ భారతమ్మ, పాలక వర్గాన్ని సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆ గ్రామంలో 'ఏప్రిల్ ఫూల్' విషాదం