తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథగా మారిన ఓ యువతికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అండగా నిలిచారు. ఆమెకు ఇంటిని నిర్మించడంతో పాటుగా ఉన్నత చదవులు చదవించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లా పచ్చునూరు గ్రామానికి చెందిన లింగయ్య- పూలమ్మ దంపతులకు కుమార్తె ఉంది. పూలమ్మ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందింది. బిడ్డ బాధ్యతలు చూసుకుంటున్న లింగయ్య కూడా... ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. ఒకే బిడ్డ కావటంతో ప్రియాంకే తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది.