కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఏరడపల్లికి చెందిన రమేశ్- శారద దంపతులు ఆరు నెలల వ్యవధిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. మృతులకు ఇద్దరు కూమార్తెలున్నారు. ఇరువురి మృతితో చిన్నారులు అనాథలయ్యారు. బంధువులు సైతం వారిని పోషించి స్థితిలో లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. దీనిపై ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలు ప్రచురించింది. పాపం పనివాళ్లు, విలపిస్తున్న చిన్నారుల కథనాలపై మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించారు. వారిని పరామర్శించి... అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిన్నారులను బాల సదన్‌లో వేసి... స్కూల్స్ తెరిచాక వారిని రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తానని తెలిపారు. త్వరలోనే వారికి రెండు పడకగదుల ఇళ్లను మంజూరు చేసి... అన్ని రకాలుగా వారిని ఆదుకుంటామని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.
చిన్నారులపై కథనానికి ఎమ్మెల్యే స్పందన... తోడుగా ఉంటామని హామీ - తల్లిదండ్రులు లేక అనాథలైన చిన్నారులు
ఆరు నెలల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల దయనీయమైన స్థితిపై ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలు ప్రచురించింది. దీనిపై మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించారు. చిన్నారులకు అండగా ఉంటానని.. అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.
చిన్నారులపై కథనానికి ఎమ్మెల్యే స్పందన... తోడుగా ఉంటామని హామీ