కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ కాలనీలో జిల్లా మహిళ సమైక్య భవన ఏర్పాటుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై భూమిపూజ చేశారు. స్త్రీలకు సంపూర్ణ వసతులు కల్పిస్తూ అన్ని రంగాల్లో అగ్రగామిగా రాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రసమయి అన్నారు. ఎక్కడైతే వనితలు చైతన్యవంతులవుతారో ఆ గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మహిళ సంఘాలు, సమైక్య సంఘాలు, పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తూ పావలా వడ్డీ రుణాలను అందిస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
మహిళా సంక్షేమమే సమాజాభివృద్ధికి చిహ్నం :రసమయి - ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కరీంనగర్‌లో జిల్లా మహిళ సమైక్య భవన భూమి పూజ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో చేయుతను అందిస్తుందని రసమయి అన్నారు.

మహిళా సంక్షేమమే సమాజాభివృద్ధికి చిహ్నం :రసమయి
మహిళా సంక్షేమమే సమాజాభివృద్ధికి చిహ్నం :రసమయి
ఇదీ చూడండి :"రాజన్న నేను కడుపులో ఏదుంటే అదే మాట్లాడుతం"