తెలంగాణ

telangana

ETV Bharat / state

సైకిల్​పై ఎమ్మెల్యే రసమయి.. ఇంటింటికి తిరుగుతూ చెక్కుల పంపిణీ - ఎమ్మెల్యే రసమయి సైకిల్‌పై సీఎం సహాయనిధి పంపిణీ

MLA Rasamayi Cycling video : నిత్యం ప్రజా కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే నాయకులకు తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలంటే సమయం దొరకడం కష్టమే. దానికి ఓ ఉపాయం ఆలోచించినట్టున్నారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కల్యాణ లక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడానికి సైకిల్ ఎక్కారు. అలా సైకిల్​పై లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా చెక్కులు అందించారు.

MLA Rasamayi Cycling video
MLA Rasamayi Cycling video

By

Published : Nov 21, 2022, 12:52 PM IST

Updated : Nov 21, 2022, 3:15 PM IST

అర్హులైన లబ్దిదారులకు సీఎం సహాయనిధి పంపిణీ.. సైకిల్​పై వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే రసమయి

MLA Rasamayi Cycling video : ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు.. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో వినూత్నతను చూపిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మానకొండూరు మండలంలోని లింగాపూర్, వెల్డి, రంగపేట, పచ్చునూర్, ఊటూర్, వేగురుపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలలో పర్యటించారు. అభివృద్ధి పనులు పరిశీలించిన ఆయన కల్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీలో అందరిని ఆకర్షించారు.

రంగపేట గ్రామంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వినూత్న తరహాలో సైకిల్​పై వెళ్లి చెక్కులు అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు ద్విచక్ర వాహనాలతో వెనకాల వస్తుండగా ఎమ్మెల్యే రసమయి సైకిల్​పై వెళ్లడం చూపరులను ఆకర్షించింది. మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని రోడ్డు మార్గాలు సరిగా లేవని ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా సేవకై ఆరాటం.. రసమయికే సొంతం అంటూ నినాదాలు చేస్తూ సాగిపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 21, 2022, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details