అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్లో రూ.12 లక్షల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజచేశారు. పారువెల్లలో మహిళా సంఘం భవనం, స్మశాన వాటికకు శంకుస్థాపన చేశారు. యాదవ సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. గన్నేరువరం మరింత అభివృద్ధి తీసుకెళ్లేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రసమయి - అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రాష్ట్ర అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలకిషన్
ఇవీచూడండి: పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి: కేటీఆర్
TAGGED:
అభివృద్ధి పనులకు శంకుస్థాపన