ముస్లిం సోదరులు కరోనా నియమాలను పాటిస్తూ రంజాన్ వేడుకలను జరుపుకోవాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు. మానకొండూరు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
'రంజాన్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి' - maana kondoor trs camp office
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో రంజాన్‌ను పురస్కరించుకుని.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు.
!['రంజాన్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి' mla rasamayee balakishan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:43:07:1619705587-tg-krn-551-29-dusthula-pampini-av-ts10084-29042021193802-2904f-1619705282-999.jpg)
mla rasamayee balakishan
కరోనా కారణంగా.. ఈ ఏడాది ఇఫ్తార్ విందు జరుపుకోలేకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.