నూతనంగా కార్పొరేషన్ పరిధిలో చేసిన ఆలుగునూర్ను కరీంనగర్‌కు ముఖద్వారంగా నిలిపేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్లే మార్గంలో కేంద్ర బిందువుగా ఉన్నందున కరీంనగర్‌కు స్వాగతం పలికేలా తోరణం నిర్మించి పట్టణాభివృద్ధిలోనే ముందంజలో ఉంచుతామని తెలిపారు.
'కరీంనగర్‌కు స్వాగతం పలికేలా తోరణం నిర్మిస్తాం..' - MLA RASAMAI BALKISHAN LATEST NEWS
నూతనంగా కార్పొరేషన్ పరిధిలో చేసిన ఆలుగునూర్ను కరీంనగర్‌కు ముఖద్వారంగా నిలిపేందుకు అక్కడ తోరణం నిర్మిస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
'కరీంనగర్‌కు స్వాగతం పలికేలా తోరణం నిర్మిస్తాం..'
అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. పది రోజులకు పట్టణ ప్రగతి కార్యాచరణలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డిఓ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:నమస్తే ట్రంప్: జనసంద్రంలా మోటేరా స్టేడియం