కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని కాచాపూర్‌లో మహిళా పొదుపు సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపూర్, పచ్చునూరు, చెంజర్ల, గట్టు దుద్దెనపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతాంగ అభివృద్ధికి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
మానకొండూరు అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
అందులో భాగంగానే రైతు బీమా, రైతు బంధు, 24 గంటల విద్యుత్ సౌకర్యం తదితర కార్యక్రమాలతో సమగ్ర సర్వే నిర్వహించి రైతు వేదికలకు శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా ఏ పంటలు వేస్తే... అన్నదాతలకు లాభదాయకమో అవే పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రసమయి బాలకిషన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.