కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటించారు. మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపల్లి, ఖాసీంపేట తదితర గ్రామాల్లో డీసీఎంఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి - ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ganneruvaram
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఖాసీంపేటలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని ప్రారంభించారు. కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షం