కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువ ప్రమాద ఘటన స్థలిని పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లె, బావ, వారి కుమార్తెలని గుర్తించారు.
'టూర్‌కు వెళ్లారనుకున్నా.. ఇలా అవుతుందని అనుకోలే'
కరీంనగర్‌లోని అలుగునూర్ కాకతీయ కాలువలో ప్రమాదంపై ఎస్పీ కమలాసన్‌రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ యాత్రలకు వెళ్తుంటారని.. ఇప్పుడు అలాగే వెళ్లారేమో అనుకున్నట్లు తెలిపారు.
'టూర్‌కు వెళ్లారనుకున్నా... ఇలా అవుతుందని అనుకోలే'
సోదరి కుటుంబం మృతిపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 27న కరీంనగర్‌లోని బ్యాంక్ కాలనీ నుంచి బయలుదేరినట్లుగా తెలిపారు. ఏడాదికోసారి యాత్రలకు వెళ్తారని... ఇందులో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తమ బావ వ్యాపారవేత్త, చెల్లెలు ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పారు. ఎవరితో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం: కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు