కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్, జంగపల్లి, పీచుపల్లి, మైలారంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. కాళేశ్వరం జలాలతో గన్నేరువరం మండల ప్రజలకు సాగు నీరు పుష్కలంగా అందుతుందని చెప్పారు. ఉప కాలువల నిర్మాణం అనంతరం ప్రతి చెరువును నింపుతామని భరోసా కల్పించారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి: రసమయి - mla
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే