కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో నాలుగేళ్లుగా పెంచుతున్న హరితహారం చెట్లను మిషన్ భగీరథ కాంట్రాక్టర్ తొలగించటం చర్చనీయాంశంగా మారింది. వెలిచాల నుంచి సుమారు రెండు కిలోమీటర్ల రహదారిపై మొక్కలు నాటి సంరక్షించారు.
భగీరథ పైప్లైన్ కోసం హరిత హారం చెట్లు తొలగించారు.. - harithaharam trees demolition in velichala village
మిషన్ భగీరథ పైపులైన్ వేసేందుకు హరితహారం చెట్లను పీకేసిన ఘటన కరీంనగర్ జిల్లా వెలిచాలలో చోటుచేసుకుంది. పచ్చని చెట్లను తొలగించటంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
హరితహారం చెట్లు తొలగించారు
ఈ క్రమంలో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ వరకు నేరుగా పైపులైన్ వేసేందుకు అధికారులు పనులు చేపట్టారు. వెలిచాల అప్రోచ్ రోడ్డు పైన బాగా పెరిగిన చెట్లను ప్రొక్లేయిన్తో తొలగించి పైపులైన్ కోసం తవ్వారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. రెండేళ్లుగా కాపాడిన హరితహారం చెట్లను ఒక్క రోజులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:మీ కుటుంబం విలువ రూ.5 వేల కంటే తక్కువా?