ఫిల్టర్బెడ్లో నీరు కలుషితం అవ్వడం వల్ల చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల.... గ్రామాల్లో పాత రక్షిత మంచినీటి బావుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.
నిలిచిపోయిన తాగునీటి సరఫరా - drinking water stopped in choppadamdi constutency
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింది. ఫిల్టర్బెడ్లో వచ్చే నీరు కలుషితం కావడం వల్ల గ్రామాలకు తాత్కాలికంగా నీటిసరఫరా నిలిపివేశారు.
![నిలిచిపోయిన తాగునీటి సరఫరా చొప్పదండి నియోజకవర్గం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11329639-15-11329639-1617883980216.jpg)
drinking water supply stopped, choppadamdi
మధ్య మానేరు ప్రాజెక్టు, దిగువ మానేరు ప్రాజెక్టుల నుంచి ఫిల్టర్ బెడ్ల ద్వారా నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల మండలాలకు పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ జలాశయాల్లో నీరు కలుషితమై దుర్గంధం వ్యాపించటంతో ముందు జాగ్రత్తగా నీటి సరఫరా నిలిపివేశారు.