ఖరీఫ్‌లో 55లక్షల టన్నులు, రబీలో 37 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఖరీఫ్ సమీక్షా సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్,కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుకు రూపొందించిన విధివిధానాలను పౌరసరఫరాల కమీషనర్ అకున్ సబర్వాల్ వివరించారు. ఈ సమావేశానికి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల సంయుక్త కలెక్టర్లతో పాటు రైస్‌మిల్లర్లు హాజరయ్యారు. గత ఏడాది ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా... ఈసారి దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి గంగుల చెప్పారు. ధాన్యం దిగుబడిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల మూడవ వారం నుంచి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన గోడప్రతిని మంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్రంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ఆధ్వర్యంలో 2544 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటిసారిగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ చైర్మన్‌గా రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో 2 వేల 544 ధాన్యం కొనుగోలు కేంద్రాలు - KOPPULA EESHWER
కరీంనగర్‌లో నిర్వహించిన ఖరీఫ్ సమీక్షా సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్లు పాల్గొన్నారు. ఖరీఫ్, రబీలో కలిపి దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు.

రాష్ట్రంలో 2 వేల 544 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాష్ట్రంలో 2 వేల 544 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఇవీ చూడండి: చివరిరోజు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు