ప్రభుత్వ ఉద్దేశాలను శిక్షణ రూపంలో చేరవేయడానికి రైతువేదికలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు నానా అవస్థలు పడ్డారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా బద్దిపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి గంగుల కమలాకర్ సోదరుడు ప్రభాకర్ జ్ఞాపకార్ధం ఆయన కుటుంబీకులు 25లక్షలతో నిర్మించగా... స్థలాన్ని బద్దిపల్లి మాజీ సర్పంచ్ ఉప్పు వెంకటయ్య, ఉప్పు మల్లేషంలు రైతు వేదికకు అందించారు.
'సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు' - telangana varthalu
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలను శిక్షణ రూపంలో చేరవేయడానికి రైతువేదికలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా బద్దిపల్లిలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ మండే వేసవి కాలంలో కూడా చెరువులు మత్తడి దూకే పరిస్థితికి తీసుకువచ్చారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సాగు, తాగునీటి కష్టాలు తొలగించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు. గతంలో విద్యుత్ సమస్యలతో రైతులు సతమతమయ్యే వారని చెప్పారు. ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని వెల్లడించారు. గతంలో రైతులు అప్పులు తీసుకువచ్చే పరిస్థితులుండేవని... వాటన్నంటికి చరమగీతంపాడుతూ రైతుబంధు పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:'రైతు వేదికలు నిత్య అధ్యయన కేంద్రాలుగా భాసిల్లాలి'