తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు ఈటల, గంగుల పర్యటన - కరంనగర్​లో మంత్రులు ఈటల, గంగుల పర్యటన

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న కరీంనగర్​ జిల్లాలోని పలు ప్రాంతాలను... మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ వేర్వేరుగా పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసినట్టు... నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.

ministers eetala rjendar gngula kamalakar visit rain effected areas in karimnagar
వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు ఈటల, గంగుల పర్యటన

By

Published : Aug 17, 2020, 10:19 PM IST

మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్ వేర్వేరుగా పర్యటించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, కలెక్టర్ శశాంకతో కలిసి కరీంనగర్​ జిల్లా కమలాపూర్‌తోపాటు జమ్మికుంట మండలాల్లో పర్యటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురిసినందువల్ల చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, పంటలు నీటి మునిగిపోయాయని మంత్రి అన్నారు.

నగునూరుతోపాటు జూబ్లీనగర్ ప్రాంతాల్లో కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. జిల్లాలో మొత్తం 1,367 చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. ముందస్తు చర్యలు తీసుకున్నందున... ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 18వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి తెలిపారు. ఆయా నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details