ఎంతో ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోస్తున్న దృష్ట్యా ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకొనేలా ప్రణాళికలు రూపొందించాలని... అధికారులను తెలంగాణ మంత్రులు ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో... అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
'నీటి సంరక్షణకు నడుం బిగిద్దాం.. జలసిరుల్ని ఒడిసి పడుదాం' - Minister eetala Rajender news
కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులతో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చెక్‌డ్యాంల నిర్మాణానికి అణువైన ప్రాంతాలు గుర్తించాలని సూచించారు. త్వరలో చేపట్టనున్న కాలువల ఆధునీకరణ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్న మంత్రులు గ్రావిటీతో నీరు అందించే ఆస్కారం లేని చోట ఎత్తిపోతల పథకాలు చేపట్టేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: వెంటాడుతున్న పెద్ద పులుల భయం