కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొని 20 మందికి గాయాలు కావడం బాధాకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
కరీంనగర్ రోడ్డు ప్రమాదంపై మంత్రి వేముల దిగ్భ్రాంతి - కరీంనగర్ రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొని 20 మందికి గాయాలైన ఘటనపై రవాణా మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదం