తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇష్టం వచ్చినట్టు బిల్లులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు: తలసాని

కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు బిల్లులు ప్రవేశపెడితే... ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ అన్నారు. 20 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదని విమర్శించారు.

minister thalasani srinivas yadav press meet in karimnagar with gangula kamalakar
ఇష్టమొచ్చినట్టు చేస్తే ప్రజలు ఊరుకోరు: తలసాని

By

Published : Sep 20, 2020, 12:55 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో చిన్న, సన్నకారు రైతులు ఆనందంగా ఉన్నారని పశుసంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్​తో కలిసి తలసాని... మీడియాతో మాట్లాడారు. కానీ కేంద్రం పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తోందని విమర్శించారు. కరోనా సమయంలోనూ... 20లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించి... ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ బిల్లు ప్రవేశపెట్టి రైతులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని తలసాని హెచ్చరించారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్ బిల్లును వ్యతిరేకించడమే కాకుండా... పార్లమెంటులో పోరాడాలని ఎంపీలకు సూచించినట్టు వివరించారు. కరీంనగర్​ నుంచి ఎంపీగా ఎన్నికై ఏడాదిన్నర గడిచినా... ఇంతవరకు నయాపైసా నిధులు తేలేదని, పైగా హైదరాబాద్​లో కూర్చొని ఏవేవో మాట్లాడతారని బండి సంజయ్​పై విమర్శలు గుప్పించారు.

ఇష్టమొచ్చినట్టు చేస్తే ప్రజలు ఊరుకోరు: తలసాని

ఇదీ చూడండి:మగబిడ్డ కోసం భార్య గర్భాన్ని కోసిన కిరాతకుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details