తెలంగాణ

telangana

ETV Bharat / state

పద్మారావుకు కరోనాపై మంత్రి కేటీఆర్​ ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా ప్రభావం పడని దేశం, రాష్ట్రం ఏదీ లేదన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​. కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన ఆయన ఆసక్తికర విషయం బయట పెట్టారు. అదేటంటే..

minister ktr on deputy speaker padmarao goud in karimnagar district
మాస్క్​ ఇచ్చినా కరోనా వచ్చింది: కేటీఆర్​

By

Published : Jul 8, 2020, 6:38 PM IST

కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల వాహనాన్ని ప్రారంభించిన ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాస్క్​ ఇచ్చినా కరోనా వచ్చింది: కేటీఆర్​

ఒక కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావుకు తాను మాస్క్‌ ఇచ్చానని చెప్పారు. కానీ పద్మారావు మాస్క్‌ ధరించకుండా జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏం కాదు హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామని చెప్పుకొచ్చారన్నారు. చివరికి పద్మారావుకే కరోనా సోకిందన్నారు. జాగ్రత్త పాటించడం మన కోసమే కాదు.. మన కుటుంబ సభ్యులకు రక్షణ కోసం అన్నారు.

కరోనా నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్​ నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కరోనా నుంచి రక్షణ కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరు వైద్యుల్లా సలహాలిచ్చేస్తున్నారని ఛలోక్తి విసిరారు.

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ABOUT THE AUTHOR

...view details