KTR Mustabad Visit for Double bedroom Houses: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొందరు పనిలేక ఆరోపణలు చేస్తున్నారని.... వారు దేశంలో ఎక్కడైనా రెండు పడక గదుల ఇళ్లు ఉంటే చూపించాలని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. కరీంనగర్ ముస్తాబాద్‌లో డబుల్ బెడ్ రూము ఇళ్లను మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు. దేశంలో ఆదర్శవంతమైన పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని... దేశానికే దిక్సూచి వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే అర్హులైన పేదలందరికీ రెండు పడక గదుల ఇల్లు అందిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క సారి మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుని తీరుతుందని వ్యాఖ్యానించారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాం. 24 గంటలు విద్యుత్ సరఫరా కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యం. త్వరలోనే అర్హులైన పేదలందరికీ రెండుపడక గదుల ఇళ్లు ఇస్తాం. కేసీఆర్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుని తీరుతుంది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై అందరికీ అనుమానాలు ఉండేవి. ఎవరైనా ఇళ్ల కోసం డబ్బులు అడిగితే లాగి కొట్టండి. ఇళ్లు రాని వాళ్లు ఉంటే బాధపడవద్దు. నాణ్యమైన ఇళ్లు ఇవ్వాలన్నదే మా సంకల్పం. రెండు పడకగదుల ఇళ్లు ప్రైవేటు బిల్డర్ నిర్మిస్తే రూ.25లక్షలు అయ్యేవి. రూ.25లక్షల విలువైన రెండు పడకగదుల ఇళ్లను ఉచితంగా ఇస్తున్నాం.