తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ జన్మదినం సందర్భంగా పేదలకు నిత్యావసరాల పంపిణీ - choppadhandi news

కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో మంత్రి కేటీఆర్​ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేదలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.

minister ktr birthday celebrations in choppadhandi
minister ktr birthday celebrations in choppadhandi

By

Published : Jul 24, 2020, 4:34 PM IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.

ఐటీ రంగంలో మంత్రి కేటీఆర్... రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను పెంచారని తెలిపారు. పరిపాలనలో పారదర్శకతను అమలు చేసేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. క్రియాశీల రాజకీయాల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్... కార్యకర్తల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి:ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details