మొక్కలు, అడవుల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించినంతగా ఏ నాయకుడు గుర్తించ లేదని, హరితహారం కార్యక్రమానికి మరెవరూ ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని వెదురుగట్ట గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మొక్కలు నాటారు.
''హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడమే కాదు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతక్కపోతే ఆ సర్పంచ్ పదవి పోతుందని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన భారత్‌లో కేసీఆర్ మాత్రమే. మున్సిపల్ చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను ఈ కార్యక్రమానికి కేటాయించిన ఘనత కేసీఆర్‌దే. హరితహారం వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదు. కేవలం భవిష్యత్ తరాల బాగు కోసమే ముఖ్యమంత్రి దీనిని చేపట్టారు.''