కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని బూరుగుపపల్లిలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రీమిత్ర ఆస్పత్రిని ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి వైద్య సేవలను ప్రారంభించారు.
శ్రీమిత్ర ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి కొప్పుల - శ్రీ మిత్ర ఆస్పత్రి
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని బూరుగుపల్లిలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రీమిత్ర ఆస్పత్రిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో ఆస్పత్రి ఏర్పాటు చేయడం వల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం ఆస్పత్రిని భవనాన్ని పరిశీలించారు.
శ్రీమిత్ర ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి కొప్పుల
గ్రామీణ ప్రాంతంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి.. ప్రజలకు వైద్యం చేయాలని సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వైద్య పరీక్ష గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండిరసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం