తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ రచించి, పాడిన పాటల సీడీని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.
కవిత నేటి యువతరానికి ఆదర్శం: మంత్రి కొప్పుల - mlc kavitha birthday celebrations
ఎమ్మెల్సీ కవిత నేటి యువతరానికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కరీంనగర్లో నిర్వహించిన ఆమె పుట్టినరోజు వేడుకలను ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రచించి, పాడిన పాటల సీడీని ఆవిష్కరించారు.
కవిత నేటి యువతరానికి ఆదర్శం: మంత్రి కొప్పుల
ఎమ్మెల్సీ కవిత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది, నేటి యువతరానికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారని మంత్రి కొప్పుల కొనియాడారు. సందేశాత్మక పాటలు రాసి, పాడిన శ్రీనివాస్‌ను కొప్పుల అభినందించారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కో-కన్వీనర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం.. వేలు పలుకుతున్న ఓట్లు