ఏడేళ్ల కాలంలో భాజపా ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula eshwar on bjp) విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరను అమాంతగా పెంచిందని ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారని ఆగ్రహం(Koppula eshwar on etela) వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున జమ్మికుంటలో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఈటలపై తీవ్ర స్థాయిలో విమర్శలు(Koppula eshwar on etela rajender) గుప్పించారు. 'ఇక్కడ వ్యక్తి కాదు.. వ్యవస్థ ముఖ్యమని' మంత్రి అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దు ఎవరికి ఉపయోగపడిందని? నల్లధనం ఏమైందని మంత్రి ప్రశ్నించారు. భాజపాలో చేరి ఏం చేస్తారని ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు. కనీసం సర్పంచ్ పదవిలోలేని రాజేందర్‌కు ఎమ్మెల్యే టికెట్... ఆ తర్వాత మంత్రి పదవినీ సీఎం కేసీఆర్(CM KCR) కట్టబెట్టారని అన్నారు. ఆ పదవులతో పాటు మెడికల్ కళాశాలకు అవకాశం ఇస్తే... ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని కాంక్షిస్తూ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
భాజపా ఏడు సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏం చేసింది? ఏం చేయబోతుంది రేపు. ఇవాళ గ్యాస్ ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధర, నిత్యావసరాల సరుకుల ధరలు పెంచింది. కష్టపడి సాధించుకున్న 24 గంటల కరెంటును ప్రైవేటుపరం చేయబోతున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు. రేపు కల్లాలు ఎత్తేసి.. రైతుల నోట్లో మట్టి కొట్టబోతున్నారు. రెండుసార్లు మంత్రిగా ఉన్న ఈటల... ఇప్పుడు రోడ్లు, రహదారులు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎవరికి ఉపయోగపడ్డది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన్రా? నల్లధనం ఏమైంది?. భాజపా వాళ్లకు ఎజెండా లేదు. ఇక్కడ వ్యక్తి కాదు.. వ్యవస్థ ముఖ్యం. దయచేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ఓటు వేసి గెలిపించండి.