తెలంగాణ

telangana

ETV Bharat / state

Koppula eshwar: అధికారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం.. కారణం అదే! - తెలంగాణ వార్తలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పంచాయతీరాజ్‌ అధికారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారి ఫోన్‌లో బిజీగా ఉండటంపై మంత్రి సీరియస్ అయ్యారు.

Koppula eshwar fires on ae, minister serious on officer
అధికారిపై మంత్రి సీరియస్, కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం

By

Published : Aug 30, 2021, 5:15 PM IST

Updated : Aug 30, 2021, 5:31 PM IST

షెడ్యూల్‌ కులాల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌... ఓ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పంచాయతీరాజ్‌ ఏఈ శ్రీకాంత్‌ రెడ్డి తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దళిత బంధు సర్వే పరిశీలనకు వెళ్లిన కొప్పుల ఈశ్వర్‌.... ఆ సమయంలో అధికారి ఫోన్‌లో బిజీగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలో అలసత్వం తగదంటూ హెచ్చరించారు. జమ్మికుంట 21వ వార్డుకు చేరుకున్న మంత్రి... అధికారి బిజీగా ఉంటడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చెప్పారు? మేము పరిశీలనకు వస్తున్నామంటే నువ్వేమో ఫోను పట్టుకుని బిజీగా ఉంటావు. ఆ చాపలు ఎవరు వేయించాలే.? ఏర్పాట్లు ఎవరు చేయాలి? మరీ ఇంత అలసత్వం ఏంటి?. మాకంటే ఎక్కువ బిజీనా నువ్వు? ఎంత మందితో మాట్లాడుతున్నాం మేము... అసలు బాధ్యత ఉందా..? నేను మీతో మాట్లాడదామనుకుంటే నువ్వేమో ఫోన్లు మాట్లాడుతున్నావు.

-కొప్పుల ఈశ్వర్, షెడ్యూల్‌ కులాల సంక్షేమశాఖ మంత్రి

ఉత్సాహంగా దళిత బంధు సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధుపై సీఎం కేసీఆర్ తొలి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. పథకం ప్రారంభం నుంచి అనేక సార్లు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత కుటుంబాల గణన ఉత్సాహంగా ప్రారంభమైంది. 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నియోజకవర్గంలో 21వేల దళిత జనాభా ఉంది. గత ఆరేళ్లలో పెరిగిన జనాభాతో పాటు వివాహమై వేరుపడిన కుటుంబాల వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వివరాలను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ నమోదు చేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 5 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట మండలాలను అర్బన్‌ రూరల్‌గా విభజించి ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్‌ చొప్పున మొత్తం ఏడుగురు పనిచేస్తున్నారు. 30మంది క్లస్టర్ అధికారులు 130మంది ప్రత్యేక అధికారులు, మరో 130 అదనపు ప్రత్యేక అధికారులతో పాటు సహాయ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 3లోగా గణన ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.

ముందు రోజే చాటింపు

దళిత బంధు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఒకరోజు ముందుగానే గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఒక్కో ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న దృష్ట్యా.... ఆ డబ్బుతో ఎలాంటి వ్యాపారం చేయబోతున్నారే విషయంపై.....5 ఆప్షన్లు ఇచ్చి ప్రాధాన్యత క్రమం తీసుకున్నారు. కుటుంబాల ఆసక్తిని తెలుసుకుంటున్నారు. బ్యాంకు సిబ్బంది లబ్ధిదారుల పేరిట బ్యాంకు ఖాతా ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకం పట్ల ఆయా కుటుంబాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

అధికారిపై మంత్రి సీరియస్

ఇదీ చదవండి:

Last Updated : Aug 30, 2021, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details