తెలంగాణ

telangana

ETV Bharat / state

Koppula Eshwar: 'దళితబంధు ఆపాలని భాజపా కుట్రపన్నింది' - telangana varthalu

దళిత సమాజానికి ద్రోహం చేసిన పార్టీ భాజపా అని మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఆరోపించారు. దళితబంధు ఆపాలని భాజపా కుట్రపన్నిందన్న ఈశ్వర్‌.. ఎస్సీలు అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Koppula Eshwar: 'దళితబంధు ఆపాలని భాజపా కుట్రపన్నింది'
Koppula Eshwar: 'దళితబంధు ఆపాలని భాజపా కుట్రపన్నింది'

By

Published : Oct 18, 2021, 10:27 PM IST

దళిత బంధు పథకం ఆపాలని చూస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఆరోపించారు. దళిత సమాజానికి జరిగిన ద్రోహంగా భావిస్తున్నామన్నారు. దళితబంధు ఆపాలని భాజపా కుట్రపన్నిందన్న ఈశ్వర్‌.. ఎస్సీలు అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ఈ పథకానికి అసలు సంబంధమే లేదని పేర్కొన్నారు. భాజపా నాయకులు దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కొప్పుల మండిపడ్డారు.

ప్రజల ఓట్లు కావాలంటే ఇంతకంటే మంచి పథకం తేవాలి కానీ.. ఎస్సీల అభివృద్ధిని అడ్డుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. దళిత సమాజానికి ద్రోహం చేసిన పార్టీ భాజపా అని కొప్పుల ఆరోపించారు. పథకం ఆపడాన్ని దళిత సమాజం ప్రశ్నించాలన్నారు. ఈ పథకం నిలిపివేతకు ఈటల రాజేందర్​ బాధ్యత వహించాలన్నారు.

ఇదీ చదవండి: EC stop Dalithabandhu: ఈసీ కీలక నిర్ణయం.. హుజూరాబాద్​ పరిధిలో దళితబంధు నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details