ముక్కోటి ఏకాదశి వేడుకల్లో భాగంగా ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయల అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఈటల
ముక్కోటి ఏకాదశి వేడుకల్లో భాగంగా మంత్రి ఈటల రాజేందర్ ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సైతం మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మన్సిపల్ ఛైర్మన్ తక్కెలపల్లి రాజేశ్వర్రావు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు