కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణ వేడుక కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
మత్స్యగిరీంద్ర స్వామి కల్యాణ వేడుకల్లో మంత్రి ఈటల - కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి
కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని మత్స్యగిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
మత్స్యగిరీంద్ర స్వామి కల్యాణ వేడుకల్లో మంత్రి ఈటల
గుట్టపై స్వామివారు బంగారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రమణీయ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకల్లో.. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:నంద్యాలలో ఆకట్టుకున్న గాడిద పోటీలు