ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయాలంటూ కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల అర్హులైన 60 వేల మంది విద్యార్థులు నష్టపోయారన్నారు.
మంత్రి గంగుల ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ - ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయాలి
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన పదిశాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలంటూ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
మంత్రి గంగుల ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ
ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి ప్రస్తుత విద్యా సంవత్సరానికి తక్షణమే పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనికపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.