తెలంగాణ

telangana

ETV Bharat / state

HARISH RAO: బండి సంజయ్​కి పాలాభిషేకం చేస్తాం.. మంత్రి హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

భాజపా నాయకులు దళితబంధుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని.. రైతు బంధు ప్రారంభించినపుడు కూడా అపోహలు సృష్టించారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు మండిపడ్డారు. సోమవారం సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. దళిత బంధు పథకం అర్హులందరికీ నూరుశాతం అందిస్తామన్నారు.

minister-harish-rao-spoke-about-dalithabandhu-scheme-in-huzurabad
minister-harish-rao-spoke-about-dalithabandhu-scheme-in-huzurabad

By

Published : Aug 14, 2021, 3:42 PM IST

Updated : Aug 14, 2021, 5:44 PM IST

సోమవారం రోజున సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభం కాబోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు వెల్లడించారు. ఈ మేరకు హుజూరాబాద్​లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కేసీఆర్​ సభలో 15 మందికి అందిస్తామని.. అనంతరం అందరికి అందజేస్తామన్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను సీఎం ఎంపిక చేశారని ఆయన అన్నారు. భాజపా నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకం అర్హులందరికీ నూరుశాతం అందిస్తామన్నారు.

భాజపా నాయకులు దళితబంధుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని.. రైతు బంధు ప్రారంభించినపుడు కూడా అపోహలు సృష్టించారని మంత్రి హరీశ్​ ఆరోపించారు. ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే ఎవరైనా ఆహ్వానిస్తారని హరీశ్​ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు రూ.10 లక్షలు అందిస్తోందని.. దళితుల మీద ప్రేముంటే మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్‌ ఇప్పించాలని సవాల్​ విసిరారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందజేస్తే పాలాభిషేకం చేస్తామని అన్నారు.

ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి నియామకం జరుగుతుందని.. గ్రామసభలో ప్రజల మధ్యే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి అర్హుడికీ దళిత బంధు అందుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అర్హులకు పథకం అందిస్తామని మంత్రి హరీశ్​ రావు ధీమా వ్యక్తం చేశారు.

పాలాభిషేకం చేస్తాం..

'కుట్రలు, కుతంత్రాలతో అనుమానాలను సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్​ 50లక్షలు ఇవ్వాలని మాట్లాడారు. మాది రాష్ట్ర ప్రభుత్వం.. చేతనైన కాడికి 10లక్షలు ఇచ్చినం. మిగతా 40లక్షలు మీరు దిల్లీ నుంచి తీసుకొచ్చి ఇవ్వండి. తప్పకుండా మీకు పాలాభిషేకం చేస్తాం. తేకపోగా చేసేటువంటి ప్రభుత్వాన్ని అందించేటువంటి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే మీకే దెబ్బ తగులుతుంది. ఎల్లుండి కార్యక్రమంలో 15కుటుంబాలను ఎంచుకుని వారికి దళితబంధు అందజేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి గ్రామానికి, మున్సిపల్​ వార్డుకు ఒక అధికారిని నియమించి.. గ్రామసభ సమక్షంలో గ్రామంలోనే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది.' -హరీశ్​ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

బండి సంజయ్​కి పాలాభిషేకం చేస్తాం.. మంత్రి హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదీ చదవండి: Congress Minority Garjana: "భాజపా, తెరాసలది 'గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ' బంధం"

Last Updated : Aug 14, 2021, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details