కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరలు పెంచినందుకు హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాజపాకు ఓటు వేయాలా అని మంత్రి హరీశ్ రావు(Harish rao campaign) ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి రోడ్ షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. తెరాస సర్కార్(TRS government) చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలి. మాకు ఉన్నది రెండేళ్ల సమయమే. నేను 5వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయించి... ఎవరి ఇంటి అడుగు జాగాలో వారికి ఇల్లు కట్టుకునేలా ఇప్పిస్తా. కచ్చితంగా ఇప్పిస్తా. మేం ఒకవేళ మాటతప్పితే రెండేళ్ల తర్వాత మళ్లీ మీ దగ్గరకే రావాలి కదా. ఎంతదూరం పోతం మేం. ఇప్పుడు ఆరుసార్లు చూసిన్రు ఈటల రాజేందర్‌ను. ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చిన్రు. ఒక్క ఛాన్స్ గెల్లు శ్రీనుకు ఇవ్వండి. కేసీఆర్ ఆశీస్సులు ఉన్నయ్. నేను తోడుగా ఉంటా. నేను నిలబడి గెల్లు శ్రీనుతోటి మీ ఇళ్లు కట్టిస్తా. ప్రతిమంత్రి వంద ఎక్కువో.. తక్కువనో కట్టిన్రు. ఒక్కఇల్లు కూడా కట్టని మంత్రి ఈటల రాజేందర్.
-మంత్రి హరీశ్ రావు