భవిష్యత్ తరాలకు ప్రభుత్వ ఆస్తుల కల్పన దిశలో తెరాస ప్రభుత్వం కృషి చేస్తోంటే.. భాజపా ప్రభుత్వం మాత్రం ఉన్న ఆస్తులన్ని అమ్మకానికి పెట్టుతోందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయసమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. జీడీపీని పెంచమంటే.. గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతోందని హరీశ్ ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే కేవలం ఆయనకు మాత్రమే మంచి జరుగుతుందని... తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే.. నియోజకవర్గానికి మంచి జరుగుతుందని వివరించారు.
ఆస్తుల కల్పన కావాలా.. అమ్ముకోవటం కావాలా...?
"విద్యుత్‌ను కొనుక్కునే స్థాయి నుంచి ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే స్థాయికి చేరుకున్నాం. కాళేశ్వరం ప్రారంభించేటప్పుడు విపక్షాలు విమర్శించాయి. మేం బతికుండగా చూస్తమా అన్నారు. ఇప్పుడు అవే నీళ్లతో పంటలు పండించి.. వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి దేశానికే ధాన్యాగారంగా మారినం. దేవాదుల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ ప్లాంట్, భద్రాద్రి విద్యుత్ కేంద్రం అంటూ ఆస్తుల కల్పన మనం చేస్తుంటే... ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మే ప్రయత్నం భాజపా ప్రభుత్వం చేస్తోంది. ఆస్తుల కల్పన చేసే ప్రభుత్వం వెంట ఉంటారా..? అన్ని అమ్ముకునే వాళ్ల వెంట ఉంటారా....? ఆలోచించండి. ఈటల రాజేందర్‌కు ఓటింగ్ భయం పట్టుకున్నది. అసలు ఆయన ఎందుకోసం రాజీనామా చేసిండు.. ప్రజా ప్రయోజనం కోసమా..?. ఈటల రాజేందర్ నాపై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. నేనేమన్నా.. 4000 ఇండ్లిస్తే.. ఒక్క గృహప్రవేశం కూడా చేయలేదన్న. నీ సోపతోళ్లం.. మేం తలా కొన్ని నిర్మించి గృహప్రవేశాలు చేసినం. పోచారం శ్రీనివాస్.. 4000, నేను.. 3600, తుమ్మల నాగేశ్వర్ 2000, తలసాని శ్రీనివాస్ 400 మందిని ఇండ్లల్లకు తోలిచ్చినం. మరి మీరు మాత్రం ఒక్క గృహప్రవేశం చేయలేదన్నా.. ఇందులో తప్పేమున్నది. విజ్ఞులైన మీరే ఆలోచించి ఎవరి పక్షాన ఉంటారో నిర్ణయించుకోవాలి." -హరీశ్‌రావు, మంత్రి
'ఈటల రాజేందర్‌కు ఓటింగ్ భయం పట్టుకుంది.. అందుకే నా మీద అవాక్కులు' ఇదీ చూడండి:
Etela Rajender: 'సీఎం కేసీఆర్ చేతిలో హరీశ్‌రావు ఒక రబ్బరు స్టాంపు'