భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నా.. ఎన్నికల(huzurabad by election) తర్వాత ఆ పార్టీలో ఉండే అవకాశం లేదని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు(minister harish rao) అన్నారు. మడిపల్లిలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్,ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన తమ పార్టీలో ఉండేటట్లు లేరని భాజపా వాళ్లే చెప్పుకుంటున్నారని ఆరోపించారు. భారత్ మాతాకీ జై అని నినాదం కూడా చేయడం లేదన్నారు. ఎంతసేపు తన గోడును చెప్పుకోవడం తప్ప చేసిందేమి లేదన్నారు.
ఆయన గోడు గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదని మన గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్లకే ఓటు వేయాలని మంత్రి హరీశ్ సూచించారు. ఎన్నికలు(huzurabad by election) దగ్గర పడుతున్నాయని.. జాగ్రత్తగా కారు గుర్తుకే ఓటువేయాలని హరీశ్ రావు ఓటర్లను కోరారు. కారు గుర్తును పోలి రోడ్డు రోలర్‌తో పాటు చపాతి తయారీ యంత్రం కూడా ఉందని ఈ రెండింటితో మోసపోయే అవకాశం ఉందని మొన్న దుబ్బాకలో కూడా ఇలాగే జరిగిందని పేర్కొన్నారు. 2వేల పింఛన్లు తీసుకొనే వాళ్లకు కారు తప్ప మరొకటి కనిపించదని జాగ్రత్తగా చూసి ఓటువేయాలని హరీశ్ రావు కోరారు.