తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish on vijaya shanthi: సినిమా యాక్టర్ల డైలాగులకు చప్పట్లే కానీ.. ఓట్లు పడవు: హరీశ్‌ - harish rao campaigning in huzurabad bypoll

విజయ శాంతి మెదక్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే గెలవలేదు కానీ.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపిస్తారా.? అని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. మెదక్‌ ఎంపీగా విజయశాంతి గెలవడానికి తానే కారణమన్నారు. సినిమా వాళ్ల డైలాగులకు చప్పట్లు కొడతారు కానీ ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ నియోజకవర్గం చల్లూరులో తెరాస అభ్యర్థి గెల్లుతో కలిసి హరీశ్‌ ప్రచారంలో పాల్గొన్నారు.

Harish rao comments on vijaya shanthi
చల్లూరులో హరీశ్‌ రావు ప్రచారం

By

Published : Oct 25, 2021, 4:08 PM IST

Updated : Oct 25, 2021, 4:13 PM IST

మెదక్‌లో చెల్లని రూపాయి హుజూరాబాద్‌లో చెల్లుతుందా అని సినీనటి, భాజపా నేత విజయశాంతిపై మంత్రి హరీశ్ రావు సెటైర్ విసిరారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరులో.. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా హరీశ్‌ ప్రచారం నిర్వహించారు.

మెదక్‌ ఎంపీగా విజయశాంతి గెలవడానికి తానే కారణమని హరీశ్‌ అన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో 6 నియోజకవర్గాల్లో ఆమెకు మెజారిటీ రాలేదని.. సిద్దిపేటలో 70వేల మెజారిటీ తెప్పించానని పేర్కొన్నారు. కేవలం 3వేల ఓట్లపై ప్రత్యర్థిపై గెలిశారని ఎద్దేవా చేసారు. ఆ తర్వాత మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పద్మాదేవేందర్‌ రెడ్డి చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

సిద్దిపేటలో విజయశాంతిని నేనే ఎంపీ చేసిన. ఆ తర్వాత కాంగ్రెస్‌ తరఫున మెదక్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఆమెనే గెలవలేదు కానీ ఈటల రాజేందర్‌ను గెలిపిస్తరా.? విజయశాంతి చెబితే ఓట్లు వేస్తరా.! సినిమా యాక్టర్లు డైలాగులు చెబితే చప్పట్లు కొడతం కానీ.. ఓట్లేస్తమా.? - హరీశ్‌ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

చల్లూరు సీతారామచంద్ర స్వామి సాక్షిగా చల్లూరును మండల కేంద్రం చేస్తానని హరీశ్‌ హామీ ఇచ్చారు. చల్లూరును మండల కేంద్రం చేయాలని గతంలో దీక్షలు చేసి ఆందోళనలు చేసినా ఈటల రాజేందర్ పట్టించుకోలేదని ఆరోపించారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే తప్పకుండా మండలం చేస్తామని స్పష్టం చేశారు.

సినిమా యాక్టర్ల డైలాగులకు చప్పట్లే కానీ.. ఓట్లు పడవు: హరీశ్‌

ఇదీ చదవండి:KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్

Last Updated : Oct 25, 2021, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details