కరీంనగర్ నగరపాలక సంస్థలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటివరకూ చేసిన అభివృద్ధి పనులను.. రాబోయే రోజుల్లో చేయబోయే పనులను వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ.. కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కరీంనగర్లో మంత్రి గంగుల ప్రచారం - latest news on minister gangula
కరీంనగర్ నగర పాలక సంస్థలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ప్రచారాల్లో జోరు పెంచారు. ప్రజలకు హామీలు గుప్పిస్తూ.. గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు.
కరీంనగర్లో మంత్రి గంగుల ప్రచారం