ప్రజలకు కొవిడ్ టీకా ఇచ్చే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈనెల 16నుంచి జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులు, ప్రతినిధులతో కరీంనగర్ కలెక్టరేట్‌లో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 31 ప్రాంతాల్లో టీకా కార్యక్రమం చేపట్టిన క్రమంలో ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో అందరికీ అండగా ఉండాలని సూచించారు.
'వ్యాక్సినేషన్లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలి'
కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులు, ప్రతినిధులతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మంత్రి గంగుల కమలాకర్, కొవిడ్ టీకా కార్యక్రమం, కరీంనగర్ కలెక్టరేట్
టీకా తీసుకున్నప్పుడు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెనువెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. తొలిరోజు వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు మొత్తం 12వేల 419మంది ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ శశాంక తెలిపారు. మూడు రోజుల పాటు జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సమీక్షా సమావేశంలో చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జడ్పీ ఛైర్‌పర్సన్ తదితరులు పాల్గొన్నారు.