విజయదశమిని పురస్కరించుకుని కరీంనగర్‌లోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో బీసీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర పాలక సంస్థ మేయర్ సునీల్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి గంగుల దసరా శుభాకాంక్షలు తెలిపారు.
విజయదశమి సందర్భంగా మంత్రి గంగుల ప్రత్యేక పూజలు - కరీంనగర్లో మంత్రి గంగుల ప్రత్యేక పూజలు వార్తలు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. ప్రజలు సంతోషకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు.
విజయదశమి సందర్భంగా మంత్రి గంగుల ప్రత్యేక పూజలు
రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వచనాలు అందించాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈసారి కరోనాతో ప్రజలు ఇబ్బందిపడ్డారని.. వచ్చే ఏడాది దసరా పండుగను కొవిడ్ రహిత వాతావరణంలో జరుపుకునేలా చూడాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి-రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు