మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు - accident news
కరీంనగర్- సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని అటుగా వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

మానవత్వం చాటుకున్న మంత్రి... ఎస్కార్టులో క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలింపు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ -సిరిసిల్ల బైపాస్ రోడ్డులో కారును లారీ ఢీకొట్టింది. అదే సమయంలో హరితహారంలో పాల్గొని అటుగా వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్... ప్రమాదాన్ని గమనించి తన ఎస్కార్టును ఆపారు. ఘటనలో ఓ వ్యక్తి గాయపడగా... క్షతగాత్రున్ని తన ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.