ఈ నెల 24,25 న జరుపుకునే క్రిస్టమస్ పండుగ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా కరీంనగర్లో క్రిస్టియన్ సోదరులకు దుస్తుల పంపిణీ, విందు భోజన కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. బతుకమ్మ, రంజాన్ పండుగల మాదిరిగానే పేద క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు గంగుల తెలిపారు. ప్రజలంతా సోదర భావంతో, ప్రేమాభిమానాలతో శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని మంత్రి సూచించారు.
'సోదర భావంతో, ప్రేమాభిమానాలతో మెలుగుదాం' - 'సోదర భావంతో, ప్రేమాభిమానాలతో మెలుగుదాం...'
రాష్ట్రంలోని ప్రజలంతా సోదర భావంతో, ప్రేమాభిమానాలతో మెలగాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. క్రిస్టమస్ వేడుకల సందర్భంగా చేపట్టనున్న ఏర్పాట్లపై కరీంనగర్లో సమీక్ష నిర్వహించారు.
MINISTER GANGULA KAMALAKER ON CHRISTMAS CELEBRATIONS